- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్లల్లో కేసీఆర్ మోసాలకు అదుపులేదు: మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో కేసీఆర్ చేయని మోసాలు లేవని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి నుంచి దళితబంధు వరకు అన్ని మోసపూరిత మాటలేనని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ఆటలకు ఇక చెక్ పడినట్టేనని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెప్పారు. ఇక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, 6 దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియమ్మ నెరవేర్చారని మల్లు రవి గుర్తు చేశారు.
ఈ మేరకు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేసారని, మోసపు మాటలతో, మభ్యపెట్టే పథకాలతో గద్దెనెక్కిన కేసీఆర్.. ప్రజలను అవసరాలను విస్మయానికి గురిచేశాడన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం అంటూ అనేక పథకాల హామీలన్నీ గాలికి కలసిపోయానని విమర్శించారు.
Also Read..