- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అందుకే JP Nadda సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడింది'
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు వచ్చి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్ని అబద్ధాలు చెబుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ఐక్యత కోసం చేపట్టిన యాత్ర 'భారత్ తోడో యాత్ర'పై జేపీ నడ్డా విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి అబద్ధాలు చెబితేనే ప్రజలు నడ్డా సొంత రాష్ట్రంలో బీజేపీని ఓడించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో అందరికీ సర్వదర్శనం ఇచ్చారని, రాష్ట్రంలో మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఎవరికీ దర్శనం ఇవ్వరని అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత పొలిటికల్ జిమ్మిక్కులో భాగమే కేసీఆర్ చేస్తున్న సర్వదర్శనమని తెలిపారు. కేసీఆర్ పాలన రాజ్యాంగబద్ధంగా ఉండదని, ప్రజాస్వామిక గొంతులను నొక్కడం ఎజెండాగా ఆయన పనితీరు ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడులు ఇందులో భాగమేనని, వార్ రూమ్‌లో మెటీరియల్ ఎత్తుకెళ్లారని ఆరోపించారు. దీనికి కేసీఆర్ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.