‘బీఆర్ఎస్ నేతలకు మైండ్ పనిచేయడం లేదు’

by GSrikanth |
‘బీఆర్ఎస్ నేతలకు మైండ్ పనిచేయడం లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కుటుంబం తొమ్మిదేళ్లలో వేల కోట్లు సంపాదించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్​గౌడ్​ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో సామాజిక న్యాయమెక్కడా? అంటూ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ యూత్​డిక్లరేషన్​సక్సెస్​కావడంతోనే బీఆర్ఎస్ నేతలకు మైండ్ పనిచేయడం లేదన్నారు. ప్రియాంక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిందని, ఆమెపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్​హామీలన్నింటికి తూట్లు పడ్డాయన్నారు. కుటుంబ పాలనలో అంతా విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఒకశాతం కూడా లేని సామాజికవర్గంలో అంత మంది మంత్రులు ఎలా? అయ్యారంటూ మండిపడ్డారు. అమరవీరుల ఆంక్షలపై నీరు చల్లి కేసీఆర్ ఫ్యామిలీ కాలం ఎల్లదీస్తుందన్నారు. కేసీఆర్​పని ఖతమేనని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం అన్నారు. ప్రభుత్వంలో ఉండి చేసిన అవినీతిని అంతా కక్కిస్తాం అంటూ మహేష్​గౌడ్​హెచ్చరించారు.

Advertisement

Next Story