- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దగ్గర్లోనే ప్రధాని మోడీ అరాచకాలకు అడ్డుపడే రోజు: కన్హయ్యకుమార్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అబద్దాలు, దోపిడికి 9 ఏళ్లు పూర్తయిందని ఏఐసీసీ జాతీయ నాయకుడు కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 9 సంవత్సరాల్లో 9 సవాళ్ల పేరిట బీజేపీ అరాచకాలను ఒక పుస్తకంలో పొందుపరిచామన్నారు. మోదీ మాట్లాడిన మాటల్లోనుంచే 9 సవాళ్ళను ప్రశ్నించామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోదీ ప్రభుత్వం అనడమే కరెక్ట్ అన్నారు. 100 రోజుల్లో నల్లధనం బయటకి తీస్తామని చెప్పిన కేంద్రం అన్ని నల్ల చట్టాలను తీసుకువస్తుందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
అధికారంలోకి వస్తే 100 స్మార్ట్ సిటీలు, మహిళల భద్రత వంటి వాటిపై కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ రెండు సార్లు అధికారంలో ఉన్నా.. కనీసం ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వ్యాక్సిన్ డబ్బులను పెట్రోల్ రేట్ల నుంచి కట్టడం విచిత్రంగా ఉన్నదని ఆరోపించారు. బీసీ పీఎం అంటూనే కుల గణన జరగకుండా మోడీ అడ్డుకుంటున్నారన్నారు. మేకిన్ ఇండియా ఫేక్ అని విమర్శించారు. అన్నీ అభూత కల్పితాలు సృష్టిస్తూ ప్రజలను విస్మాయానికి గురిచేస్తున్నారన్నారు. తప్పులు చేసిన వాళ్ళంతా బీజేపీ వాషింగ్ మెషిన్‌లోకి వచ్చి పవిత్రంగా మారుతున్నారన్నారు.
అదానీ అభివృద్ధినే దేశ డెవలప్మెంట్‌గా బీజేపీ భావిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోందన్నారు. గత ప్రభుత్వం కంటే మోదీ ప్రధాని అయ్యాక పేదవాళ్ళ సంఖ్య పెరిగిందన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివో ఎందుకు చెప్పడం లేదన్నారు. 9 సంవత్సరాల్లో మోదీ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. పుల్వామా ఘటనకి ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా.. కేంద్రం వినలేదని చెప్పారు. మోడీ అరాచకాలకు అడ్డుపడే రోజు దగ్గర్లోనే ఉన్నదని కన్హయ్య కుమార్హెచ్చరించారు.