- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌లా తాను కూడా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని హితవు పలికారు. కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల, సిద్దిపేటకు నేను వస్తా. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొస్తా. చర్చకు సిద్ధం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తోంది. ప్రస్తుతం తెగిన గాలిపటంలా కేటీఆర్, హరీష్ రావు పరిస్థితి ఉంది. రేవంత్‌ను చూసి ఓర్వలేకపోతున్నారని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెరేళ్లలో దళితులను కొట్టిన మీ పాలనను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే.. లాఠీలు విరిగేలా కొట్టింది నిజం కాదా?, ప్రొఫెసర్ కోదండరాంను ఇబ్బంది పెట్టింది నిజం కాదా? అని అడిగారు. ధర్నా అనే పదాన్ని పదేళ్లు దిగజార్చారు అని మండిపడ్డారు.