తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడే కొట్లాడిండా..?

by Gantepaka Srikanth |
తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడే కొట్లాడిండా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడే కొట్లాడిండా? అంటూ కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం ప్రశ్నించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఆంధ్రా బడా బాబులకే పెద్ద పీఠ వేశారన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే సహించమన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అనవసరమైన ఆరోపణలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికీ సోనియమ్మ ఇచ్చిన కానుకే అన్నారు. స్వరాష్ట్రం ప్రకటించిన తర్వాత సోనియమ్మ కాళ్లు మొక్కి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని తెలిపారు. ఎంతోమంది ఉద్యమకారులను విస్మయానికి గురి చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తన దొరతనాన్ని చూపించాడన్నారు. పదేళ్లు పవర్‌లో ఉండి రజాకార్ల కంటే దారుణంగా పరిపాలించాడన్నారు. వివిధ ప్రాజెక్టులపై లక్షల కోట్లు దోచుకున్నాడన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని మందకృష్ణ విమర్శించడం దారుణమన్నారు. ఆయన బీజేపీ లీడర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed