పదేళ్లు కేంద్రం గుడ్డి గుర్రం పళ్లు తోమిందా? కిషన్ రెడ్డి‌పై కాంగ్రెస్ నేత ఫైర్

by Ramesh N |
పదేళ్లు కేంద్రం గుడ్డి గుర్రం పళ్లు తోమిందా? కిషన్ రెడ్డి‌పై కాంగ్రెస్ నేత ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే మంచి సంస్థగా పేరొందిన సింగరేణి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురై, దివాలా తీసే స్థితికి చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కామెంట్స్‌పై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పలు ప్రశ్నలు వేశారు.

‘కిషన్ రెడ్డి గారు.. అంటే కేంద్రం ఈ పది సంవత్సరాలు గుడ్డి గుర్రం పల్లు తోమిందా? సింగరేణిలో 49%వాటా ఉన్న కేంద్రం సింగరేణిలో ఆర్థిక విద్వంసం జరుగుతుంటే బీఆర్ఎస్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? పార్లమెంటులో గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చట్టాలు చేసి సింగరేణిని విధ్వంసం చేసింది బీజేపీ కాదా? ఆ చట్టాలకు పూర్తి మద్దతునిచ్చింది బీఆర్ఎస్ కాదా? పది సంవత్సరాలు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని తమ అవినీతితో ఆర్థిక విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పై ఒక్క విచారణ జరిపించకుండా కాపాడింది ఎవరు? మీరు కాదా?’ అంటూ సామ రామ్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed