‘హరీష్​రావుకు సిగ్గుండాలే’.. మాజీ మంత్రిపై కాంగ్రెస్ నేత దయాకర్ ఫైర్

by Satheesh |
‘హరీష్​రావుకు సిగ్గుండాలే’.. మాజీ మంత్రిపై కాంగ్రెస్ నేత దయాకర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీక్షల దగ్గర రాజకీయం చేయడానికి మాజీ మంత్రి హరీష్​రావుకు సిగ్గుండాలని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు పవర్‌లో ఉండి నిరుద్యోగులకు ఏం చేశారని..? ప్రశ్నించారు. ఇప్పుడు కపట ప్రేమలు చూపుతూ అధికారం కోసం నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తోనే నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. దీక్షల దగ్గర దొంగ రాజకీయం చేసే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు కూడా రోజురోజుకి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇది సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పాలించిన పది ఏళ్లు గ్రూప్ 1ను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి కనిపించిందన్నారు. ఇక బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ మోసం చేసిందన్నారు.

Next Story