చిన్న పిల్లలకు తలస్నానం చేపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి

by Prasanna |
చిన్న పిల్లలకు తలస్నానం చేపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి
X

దిశ, ఫీచర్స్: చిన్నపిల్లలను మూడేళ్లు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా, వారికి స్నానం చేయించేటప్పుడు కొన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. మీ బిడ్డకు స్నానం చేయించేటప్పుడు ఈ తప్పులను చేయకండి. రెండేళ్లలోపు పిల్లలకు నేరుగా తల మీద నీరు పోయాయకూడదు. ఇలా చేస్తే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. దీని వలన కలిగే నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

తలస్నానం చేసేటపుడు నేరుగా నీళ్లను తలపై పోస్తే ఆ నీరు బిడ్డ ముక్కు, చెవుల్లోకి చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ ముక్కు, చెవుల్లోకి నీరు చేరడం వల్ల దురద, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీ బిడ్డకు స్నానం చేసేటప్పుడు, మీ చేతులతో మాత్రమే జుట్టును కడగాలి.

తలస్నానం చేసేటప్పుడు నేరుగా శిశువు తలపై నీటిని పోయడం వలన అంగిలి బలహీనపరుస్తుంది. అందువల్ల, న్యుమోనియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీని వలన ఆరోగ్య సమస్యల నుండి మీ బిడ్డను రక్షించుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed