ఇంత మోసమా.. ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు.. రాఘవ లారెన్స్‌పై నెటిజన్స్ ఫైర్!

by sudharani |
ఇంత మోసమా.. ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు.. రాఘవ లారెన్స్‌పై నెటిజన్స్ ఫైర్!
X

దిశ, సినిమా: డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే.. సేవా కార్యక్రమాల్లో పొల్గొంటూ ఉంటారు. అలాగే.. ఈయన గొప్ప మనసు గురించి కూడా అందరికి తెలిసిందే. పేద ప్రజలకు, అనాధ పిల్లలకు, ఎంతో మంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా సాయం చేస్తుంటారు. అంతే కాకుండా చాలా మందిని దత్తత తీసుకుని వారిని సొంత బిడ్డల్లా పెంచుకుంటారు. అలాంటి గొప్ప మనసు ఉన్న లారెన్స్‌పై ప్రజెంట్ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అన్నా.. ఇంత మోసం చేస్తావా అంటున్నారు నెటిజన్లు. అసలు విషయం ఏంటంటే...

రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన కొన్ని సినిమాలను స్వయంగా కంపోజ్ చేశారు కూడా. వీటిలో నాగార్జున ‘డాన్’ సినిమాలో ‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు’ అనే పాట ఒకటి. ఇది అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అంతే కాకుండా.. ఇప్పటికీ కూడా ఇది చాలా మందికి ఫేవరెట్ సాంగ్స్‌లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఈ సాంగ్ కంపోజ్ చెయ్యడానికి ఎంతో కష్టపడ్డాము అని అప్పట్లో చాలా సందర్భాల్లో లారెన్స్ కూడా చెప్పకొచ్చాడు. అయితే.. ఈ సాంగ్ ఒరిజినల్ ఇప్పుడు బయట పడింది.

సాయి కిరణ్ హీరోగా నటించిన ‘సువర్ణ’ అనే సినిమాలోని ఈ పాట ఉంది. అది కూడా సేమ్ టూ సేమ్ ‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు’ అనే లిరిక్ ఉండటంతో.. ఆ సాంగ్‌ను ట్రెండ్ చేస్తూ.. ఇందులో నుంచే రాఘవ లారెన్స్ సాంగ్ కాపీ చేసి ‘డాన్’ మూవీ తెలివిగా పెట్టాడు అని ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు.. ‘ఏంటి లారెన్స్ అన్నయ్య ఇంత పని చేసావ్’, ‘ఇంత మోసం ఏంటీ అన్నా’ అంటూ ఫన్నీగా ఫైర్ అవుతున్నారు.

Next Story

Most Viewed