సోషల్ మీడియాలో నకిలీ నీట్-పీజీ పరీక్షల తేదీపై ఎగ్జామ్ బోర్డు హెచ్చరిక

by S Gopi |
సోషల్ మీడియాలో నకిలీ నీట్-పీజీ పరీక్షల తేదీపై ఎగ్జామ్ బోర్డు హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని వారాలుగా నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంతో దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దాంతో జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ-2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి కొత్త తేదీల ప్రకటన అంటూ సోషల్ మీడియాలో ఓ లెటర్ సర్క్యులేట్ అయ్యింది. అప్రమత్తమైన నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) నకిలీ నోటీసులపై హెచ్చరించింది. ఎన్‌బీఈఎంఎస్ పేరుతో వచ్చిన ఈ ప్రకటన, ఫిషింగ్ ఈ-మెయిల్‌లు, మెసేజ్‌లు అభ్యార్థులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. తొలుత జూలై 2న పరీక్షల తేదీలు వెలువడతాయని భావించినప్పటికీ ఎన్‌బీఈఎంఎస్ సిద్ధం చేసిన షెడ్యూల్‌ను కేంద్రం ఆమోదించలేదని, ప్రభుత్వ అనుమతి తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కాబట్టి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి నకిలీ షెడ్యూల్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా నిజమైన నోటీసులకు, నకిలీ వాటికి మధ్య తేడాలను గుర్తించేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. 2020, జూలై తర్వాత వచ్చే అన్ని నోటీసులకు క్యూఆర్ కోడ్ ఉంటుందని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed