- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: సమాజ క్షేమం కోసం సూర్యారాధన ఆచరించిన పవన్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో భాగంగా ఆయన మంగళగిరి జనసేన కార్యాలయంలో సూర్యారాధన చేశారు. ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులయిన పవన్ కల్యాణ్.. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య సమస్కారం ప్రకరణంగావించారు. మంత్ర సహిత ఆరాధన నిర్వర్తించారు.
ఈ సందర్భంగా సూర్యారాధన విశిష్టతను పవన్ కల్యాణ్‌కు వేద పండితులు వివరించారు. సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేస్తారని తెలిపారు. ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు పేర్కొన్నారు. పురాణ ఇతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన పవన్ కల్యాణ్‌కు వివరించారు. వనవాసంలో ధర్మారాజు ప్రత్యక్ష భగవనుడిని ప్రారంభించారని, తద్వారా ఆక్షయ పాత్ర పొందారని మహాభారతం చెబుతోందన్నారు. శ్రీ మహావిష్ణువు సూర్య భనవానుడి నుంచి చక్రయుధాన్ని పొందారని తెలిపారు. ఆరోత్యానికి సైతం సూర్యారాధన మేలు చేస్తోందన్నారు. బ్రిటీష్ పాలకు ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మరిపోయిందని, కానీ మన సంస్కృతిలో ఆ రోజుకు విశిష్ణత ఉందని వేద పండితులు తెలిపారు. రవి వారం అని పిలచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని, అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చునని పవన్ కల్యాణ్‌కు వేద పండిపతులు తెలిపారు.