- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ గీతం చరిత్రలో నిలిచిపోతుంది: బెల్లయ్య నాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: అందెశ్రీని తప్పుబడుతున్న బీఆర్ఎస్ నాయకులంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు? అంటూ టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. తాను 1996 నుంచి ఉద్యమంలో ఉన్నానని, ఇప్పుడు ఎగిరిఎగిరి పడే బీఆర్ఎస్ నేతలు ఆనాడు ఉద్యమంలో లేరన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ గేయాన్ని, పదేండ్లుగా తటస్థం చేస్తే, కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీతో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్ర గీతాన్ని ప్రిపేర్‌కు సన్నద్ధం చేశారన్నారు. ప్రజలు, ఉద్యమ కారుల అభిప్రాయాలను అందించే ప్రయత్నం చేస్తుంటే, బీఆర్ఎస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ గీతాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశామన్నారు.
దీనిలో భాగంగానే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేశామన్నారు. ఇక ఇద్దరు మాట్లాడుకున్న ప్రైవేట్ డిస్కషన్ రికార్డ్ విడుదల చేసి, అందెశ్రీని అవమానపరచడం దారుణమన్నారు. దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్లు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందన్నారు. బీఆర్ఎస్ కాకతీయ తోరణం కోసం సంబుర పడుతుందని, సమ్మక్క, సారలమ్మలను చంపిన చరిత్ర కాకతీయ రాజులకు ఉన్నదని ఆరోపించారు. అందుకే చిహ్నంలో నుంచి తొలగించామన్నారు. దాని ప్లేస్‌లో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అమరవీరులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలకు తెరలేపినా, ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.