- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేటీఆర్‌కు అధికార మత్తు ఇంకా దిగలేదు: బెల్లయ్య నాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు అధికార మత్తు ఇంకా దిగలేదని ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హామీలపై 420 బుక్ లెట్‌ను విడుదల చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ తమను 420 అనడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా పాలన సాగించారన్నారు. అందుకే ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అండగా నిలిచారన్నారు.
గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం కట్టి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే కనీసం సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు దోస్తీ విధానంతో వెళ్లి తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. కాళేశ్వరం స్కామ్‌లో బీజేపీ నేతలకు కూడా కమీషన్లు వెళ్లాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి చరిత్రను ప్రజల ముందు ఉంచుతామన్నారు. తప్పులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతామన్నారు.