నెహ్రూ చనిపోయిన రోజునే కావాలని నూతన పార్లమెంట్ ఓపెనింగ్: బెల్లయ్య నాయక్

by Satheesh |
నెహ్రూ చనిపోయిన రోజునే కావాలని నూతన పార్లమెంట్ ఓపెనింగ్: బెల్లయ్య నాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దారుణమని ఆదివాసీ కాంగ్రెస్​చైర్మన్​బెల్లయ్య నాయక్​విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీలను బీజేపీ, ఆర్ఎస్‌ఎస్​దారుణంగా అవమానిస్తుందన్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ రాష్ట్రపతి పోస్టులో ఉన్నందునే ఈ నెల 28న జరిగే కొత్త పార్లమెంట్ ఇనాగ్రేషన్‌కు ఇన్విటేషన్​ఇవ్వలేదని ఫైర్​అయ్యారు. దేశ ప్రధమ పౌరురాలును పిలవకుండా పార్లమెంట్ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ఫైర్​అయ్యారు. ఇది దేశంలోని మహిళలు, గిరిజనుల్ని అవమానించడమేనని చెప్పారు.

మతతత్వ పార్టీగా పేరొందిన బీజేపీ నిత్యం ప్రజలు, వ్యవస్థల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఇక నెహ్రూ చనిపోయిన రోజు కావాలనే పార్లమెంట్ ఇనాగ్రేషన్ చేస్తున్నారన్నారు. దీన్ని కాంగ్రెస్​పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 25వ తేదిన జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

అంతేగాక 26వ తేదిన మండల కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 27 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత 28వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలిసేలా ప్రణాళికలు చేపడతామన్నారు.

మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసుల ఓట్లని లాక్కోవడానికి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసి.. ఇప్పుడు అవమానపరచడం సరికాదన్నారు. ఆమెను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవకపోవడం ఆదివాసీలను అవమానించినట్లేనని చెప్పారు. ఏకంగా పార్లమెంట్‌కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం దారుణమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చెడ్డపేరని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed