- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమరవీరుల స్థూపాన్ని కేసీఆర్ అపవిత్రం చేశారు.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని శనివారం తెలంగాణ ఉద్యమ అమరుల స్థూపాన్ని పాలతో ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ శుద్ధి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కన్న తల్లిలా చలించిపోయిన నాటి యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని త్యాగాలు చేస్తే.. వారి త్యాగాలను వమ్ము చేసి అమరుల ఆశయాలకు తూట్లు పొడిచి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని నిరసిస్తూ పాలతో శుద్ధి చేశానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని, రాష్ట్రం కోసం కేసీఆర్ గొంగళి పురుగునైన ముద్దాడతానని మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రకటించిన వెంటనే సోనియాని కేసీఆర్ కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కలిసి నమ్మించి రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో నీళ్లు, నిధులు, నియామకాల కోసం బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, సకల జనులు రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తే కేవలం కేసీఆర్ కుటుంబమే తొమ్మిది ఏళ్ల పాలనలో కుటుంబ సమేతంగా శాఖల వారీగా విభజించుకుని లక్షల అప్పులు చేసి, అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు.