- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనుమాన్ చాలీసా కూడా బీజేపీకి అధికారం ఇవ్వదు: అద్దంకి దయాకర్
దిశ, వెబ్ డైనమిక్ బ్యూరో: త్యాగానికి ప్రతీక అయిన హనుమంతుడి పేరును బీజేపీ నేతలు విధ్వంసానికి ఎందుకు వాడుతున్నారని, అలా ఎవరు ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. బజరంగ్ దళ్‌ను నియంత్రిస్తామంటే బీజేపీకి వచ్చిన సమస్యేంటని ఆయన నిలదీశారు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీపై తెలంగాణలో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. హనుమాన్ చాలీసా కూడా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాలేదని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. బజరంగ్ దళ్ అనే సంస్థ మంచికోసం పుట్టిందని, దాడులు చేయమనే సంస్కృతిని ఆర్ఎస్ఎస్ నేర్పిందా అని ప్రశ్నించారు. భారత సమాజం, భారతీయులపై దాడుల చేయమని బీజేపీ చెబుతోందా అని నిలదీశారు. గౌరీ లంకేశ్ హత్య వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తే ప్రధాని, హోంమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు.
Read More: తెలంగాణలో ప్రియాంక గాంధీ చేయబోయే ప్రకటన ఇదే: మల్లు రవి