- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. ఇకపై నెలకు రెండు సార్లు ఆమె తెలంగాణకు వచ్చేలా ప్లాన్!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంపై ప్రియాంక గాంధీ ఫోకస్పెట్టారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఇక్కడ గెలవాలనే తాపత్రయంతో కాంగ్రెస్అడుగులు వేయనున్నది. దీన్ని ప్రియాంక గాంధీ మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. దీనిలో భాగంగానే జూన్నుంచి ప్రతీ నెల కనీసం రెండు సార్లు రాష్ట్రానికి రావాలని టీపీసీసీ నేతలు ఆహ్వానించగా.. ప్రియాంక ఒకే చెప్పినట్లు తెలుస్తోన్నది. దీంతో తెలంగాణ కాంగ్రెస్నేతల్లో నూతనోత్సాహం నెలకొన్నది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లోనూ ప్రియాంక పర్యటనలు ఉండేలా కాంగ్రెస్పార్టీ షెడ్యూల్తయారు చేస్తున్నది. ఈ మేరకు ఈ నెల 26న టీపీసీసీ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మన రాష్ట్రంతో పాటు మరో మూడు రాష్ట్రాల నేతలతోనూ ప్రియాంక భేటీ కానున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రియాంక కాంగ్రెస్పార్టీకి ప్రజల ఆదరణను స్పష్టంగా చూశారని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. సరూర్నగర్లోని నిరుద్యోగ నిరసన సభ కూడా సక్సెస్కావడంతో ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేటాయించినట్లు నేతలు వివరిస్తున్నారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి కూడా ప్రియాంక గాంధీని పోటీలో దించాలని కూడా టీ– కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.