- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో గెలుపుపై కాంగ్రెస్ కనేది పగటి కలలే : కేఏ పాల్
తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఏమాత్రం ఓటు బ్యాంక్ లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ మూడు నాలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే అదానీ, అంబానీలు కుబేరులు అయ్యేలా చేసిందని ఆరోపించారు. రాష్ట్రాలు మాత్రం లక్షల కోట్ల అప్పుల్లో మునిగి పోయాయన్నారు. కాంగ్రెస్ దేశంలో కుటుంబ పాలన తీసుకు వచ్చిందని విమర్శించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థులు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమన్నారు. గతంలో 21 మందిలో 16 మంది టీఆర్ఎస్‌లో చేరారని అయన గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర ఓటమి దక్కిందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే సాధించిందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బృందం కొంత మంది నాయకులకు కోట్లు ఎర వేసి కాంగ్రెస్‌లో చేర్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలు 62 శాతం ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతంగా ఉన్న రెడ్లనే కాంగ్రెస్ అధిష్టానం సీఎంలు చేశారని తెలిపారు. అంబేడ్కర్, గద్దర్, ప్రజా శాంతి పార్టీ పాలన రావాల్సిన రోజులు వచ్చాయన్నారు. వచ్చేనెల రెండో తేదీన సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభను బీసీలు విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు .