- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress : క్షక్ష సాధింపునకు పోలేదు! జన్వాడ ఫామ్‌హౌస్ పోలీసుల సోదాలపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులకు ఆనాడు చట్టం గుర్తుకు రాలేదా? అని తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా గత కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి లోపలికి వచ్చిన పోలీసులు వీడియో పోస్ట్ చేసింది. నాడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి ప్రోటోకాల్ పాటించకుండా, వారేదో సంఘ విద్రోహ శక్తులు అన్నట్టు, అర్ధరాత్రి పూట భార్యాభర్తలు కలిసి ఉన్న సమయంలో వారి బెడ్ రూమ్ తలుపును పగలగొట్టి పోలీసులు అన్యాయంగా, నిరంకుశంగా ప్రవర్తించారు.. అని ఆరోపించింది.
నేడు పోలీసులు బాధ్యతాయుతంగా వారి విధులు నిర్వహించారని, కక్షలకు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ప్రవర్తించిందని వెల్లడించింది. ఈరోజు నీ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో పార్టీ గురించి స్థానికులు ఫిర్యాదు చేస్తే, పోలీసులు సెర్చ్ చేశారని తెలిపారు. నిషేధిత లిక్కర్, క్యాసినోకి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారని, డ్రగ్ టెస్ట్ చేసి వివరాలు తెలిపారని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అయింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది జన్వాడ ఫామ్‌హౌస్‌లో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ జరిగింది రేవ్ పార్టీ కాదని, ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్‌ను కావాలనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.