- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కులగణన ప్రక్రియ వేగవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ కులగణన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నేతలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. అంతేగాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు బీసీ సంక్షేమ సంఘం తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు సహ ఇతర బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.