- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ తమిళి సై ప్రసంగంపై కాంగ్రెస్, BJP రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలో చాలా అబద్ధాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సెషన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద ఈటల ప్రెస్‌తో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుల్ని గవర్నర్ చేత చెప్పించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామనేది పెద్ద అసత్య ప్రచారమని అన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్‌పై గవర్నర్ ప్రస్తావించలేదని అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం చదవకపోయి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ మొత్తం ప్రసంగంలో ఒక్క నిజం కూడా లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో చూపించాలని సవాల్ విసిరారు. దళితబంధు పేరుతో దళితుల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం అని భావిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు.