- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన జనగాం, స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఫైట్.. చక్రం తిప్పిన మంత్రి కేటీఆర్..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి జనగాం, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పంచాయితీ కొనసాగుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఓ వైపు, మంత్రి కేటీఆర్ మరోవైపు నేతలు చర్చించి సమస్యను పరిష్కరించారు. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి అప్పగించారు. అయినప్పటికీ ఇరువురు టికెట్‌పై ఆశలు వదులుకోకపోవడంతో మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించారు.
పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. వారికి సైతం పార్టీ అడగా ఉంటుందని మంత్రి సైతం భరోసా ఇచ్చారు. అయితే నర్సాపూర్ టికెట్‌పై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మధన్ రెడ్డి టికెట్ పట్టుపడుతుండటంతో కేటీఆర్ చర్చించినా ఫలించలేదు. దీంతో గత నాలుగైదురోజులుగా ప్రగతిభవన్‌కు మదన్ రెడ్డి వచ్చి వెళ్తున్నారు. చివరకు పార్టీ అధినేత ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. టికెట్ మాత్రం సునీతాలక్ష్మారెడ్డికి ఇస్తున్నామని గెలుపునకు కృషి చేయాలని అధినేత సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
మల్కాజ్ గిరి టికెట్‌ను ఉద్యమకారులు, కొంతమంది నేతలు ఆశిస్తున్నారు. అయితే అభ్యర్ధిగా మర్రిరాజశేఖర్ రెడ్డికి ఇస్తున్నామని గ్రౌండ్‌లో ఉండాలని పార్టీ సూచించినట్లు తెలిసింది. నియోజకవర్గ నేతలకు సైతం ఇదే అంశాన్ని చెప్పినట్లు సమాచారం. ఇక నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలు నామమాత్రమే కావడంతో ఆ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నవారు సైతం తక్కువే. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్ పేరును దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.
గోషామహల్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, నందకిశోర్ వ్యాస్ బిలాల్‌లు పోటీ పడుతుండగా ప్రేమ్ సింగ్ రాధోడ్‌కు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రెండుమూడ్రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ ఓకే చెప్పడంతో నేతలంతా ప్రచారకార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారు. ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు భీఫాం ఇస్తుండటంతో వీరికి కూడా అదే రోజు ఇస్తుననట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.