నిబంధనలు లేకుండా తక్షణమే పూర్తి విపత్తు సహాయం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
నిబంధనలు లేకుండా తక్షణమే పూర్తి విపత్తు సహాయం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ(Telangana)ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో వరద నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి స్వయంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (shivaraj singh chouhan) ఇదివరకే ఏరియల్ సర్వే చేయగా.. గురువారం ఆరుగురు సభ్యులు గల కేంద్ర బృందం రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కాగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం అంచనా వేయడానికి శుక్రవారం సచివాలయంలో కేంద్ర బృందంతో.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో సహ మంత్రుల బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే పూర్తి విపత్తు సహాయాన్ని ప్రకటించాలని కోరారు.

వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని, వరదల శాశ్వత పరిష్కారానికి కేంద్ర వద్ద యాక్షన్ ప్లాన్ ఉండాలని అన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, దానికి కేంద్రం సహాయం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. సీఎస్ శాంతికుమారి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే కేంద్ర బృందం ఇచ్చే నివేదికల ఆధారంగా విపత్తు సహాయాన్ని అందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith sha) హామీ ఇవ్వగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తీవ్ర వరద నష్టాలపై తక్షణ సహాయక చర్యల కింద తెలంగాణ (Telangana), ఏపీ(AP)కి కలిపి రూ.3300 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed