దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

by Gantepaka Srikanth |
దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Danam Nagender)పై రాష్ట్ర మహిళా కమిషన్‌(Women's Commission) చైర్మన్ శారదకు బీజేపీ మహిళా నేతలు కంప్లైంట్ చేశారు. బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut)పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ‘సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదు’ అంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు సహించరని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ మీద.. ఇతర బీజేపీ నాయకులపై సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు, డీజీపీలు చర్యలు తీసుకోవాలంటూ దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కాగా.. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed