- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయండి
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: జూన్11న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం ఈనెల 25న విచారణ జరపాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో గతంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్పరీక్షను బోర్డు అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు మెయిన్స్‌కు ప్రిపేర్అవుతుండగా జరిగిన ఈ పరిణామాలతో అభ్యర్థులు మానసికంగా కుంగిపోయారు.
కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్పరీక్షను జూన్11న నిర్వహించాలని నిర్ణయించిన బోర్డు ఈ మేరకు నోటిఫికేషన్కూడా జారీ చేసింది. కాగా, దీనిని ఆపివేయాలని అభ్యర్థిస్తూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌వేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ తదనంతర పరిణామాల నేపథ్యంలో తాము ప్రిలిమ్స్పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేసేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిని స్వీకరించిన హైకోర్టు ఈనెల 25న జరుపనుంది.