- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్ నమోదైంది. 55 ఏళ్ల ఎండీ రషీద్, అతని భార్య కరీమా, షరీఫ్, అజహార్, ఎస్కే మజీద్ ఖాన్, ఎండీ లాల్బీబీ, డి.సమ్మక్క మృతులకు మంత్రి ఎర్రబెల్లి కారణమంటూ కాంగ్రెస్‌నేత బక్క జడ్సన్ఫిర్యాదు చేశారు. వంతెన పాడైనా.. మరమ్మత్తులు చేయకపోవడంతోనే బాధితులకు ప్రమాదం జరిగినట్లు జడ్సన్ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇటీవల ఏటూరు నాగారం మండలంలోని పత్తిపాక గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వయంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతీలోని ఖాళీ మద్యం బాటిళ్లను సేకరించి పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని, దాంతోనే రోడ్లు, వంతెనలు రిపేర్లు చేసుకోవాలని బాధ్యతారాహిత్య ప్రకటన చేశారంటూ హెచ్‌ఆర్‌సీకి వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితిశారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున సకాలంలో చర్యలు తీసుకోలేదని జడ్సన్ఫైర్ అయ్యారు.