మానవత్వంతో స్పందించిన రాచకొండ కమిషనర్

by GSrikanth |
మానవత్వంతో స్పందించిన రాచకొండ కమిషనర్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఆయన పేరు సత్యనారాయణ. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు. ఓ సమస్యపై ఫిర్యాదు ఇవ్వటానికి రాచకొండ కమిషనరేట్‌కు వీల్​చైర్‌పై వచ్చాడు. ఆయన నడవలేని స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న కమిషనర్ డీ.ఎస్.చౌహాన్​తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. రాచకొండ పోలీస్​కమిషనరేట్​పరిధిలో నివాసముంటున్న సత్యనారాయణ వయసు 99 సంవత్సరాల వయసు.

కాగా, అతని చిన్న కొడుకు కొన్నిరోజులుగా ఆస్తి, డబ్బుకు సంబంధించి సత్యనారాయణతో గొడవ పడుతున్నాడు. రోజూ మానసికంగా హింసిస్తున్నాడు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో సత్యనారాయణ సోమవారం తన చిన్న కుమారుడిపై ఫిర్యాదు చేయటానికి వీల్​చెయిర్‌పై కమిషనరేట్‌కు వచ్చాడు. కాగా, సత్యనారాయణ నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలిసి కమిషనర్​చౌహాన్​తన ఛాంబర్​నుంచి బయటకు వచ్చి ఆయన ఫిర్యాదును స్వీకరించారు.

తక్షణమే విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్దులు, మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పోలీస్​స్టేషన్లకు స్వయంగా రాలేనివారు రాచకొండ వాట్సాప్​కంట్రోల్​రూంకు 94906 17111 నెంబర్​లేదా సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసినా సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed