బ్రేకింగ్: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

by Satheesh |   ( Updated:2023-01-30 12:01:49.0  )
బ్రేకింగ్: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన భోగ శ్రావణి రాజీనామాకు సోమవారం కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అంతకుముందు ఉదయమే రాజీనామా విషయంలో భోగ శ్రావణి నుండి క్లారిటీ తీసుకున్న కలెక్టర్ రవి ఆమె రాజీనామా ఆమోదిస్తూ.. కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు వైస్ చైర్మన్‌గా ఉన్న గోలి శ్రీనివాస్‌కు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు ఇస్తున్నట్లు అధికారక ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో గత ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జగిత్యాల బల్దియా ఛైర్పర్సన్ రాజీనామా విషయంలో స్పష్టత వచ్చింది.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

Advertisement

Next Story