- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 50 వేల టన్నుల కందులు సేకరణ : మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులు కొనుగోలు చేయడానికి సిద్ధమైందని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ కందుల కొనుగోలుపై మార్కెఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కంది దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంతో పాటు పప్పు ధాన్యాలు పండించే రైతుకు అదనపు లాభం సమకూర్చడమే లక్ష్యంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో దేశ వ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) లక్ష్యంగా నిర్దేశించుకుందని వెల్లడించారు. ఇందులో భాగంగా 50 వేల టన్నులను ఏఎంసీ, ఎంసీఎస్, పీఏసీఎస్, ఎఫ్పీఓల ద్వారా తెలంగాణ మార్కెఫెడ్ ద్వారా సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మార్కెఫెడ్‌ని నోడల్ ఏజన్సీగా నియమించామని తెలిపారు. తొలిసారి మద్దతు ధరకు మించి రోజువారీ మార్కెట్ రేటుకు అనుగుణంగా వ్యాపారులతో పోటీ పడి రైతులకు అత్యధిక ధర చెల్లించి కందుల సేకరణకు సిద్ధంగా ఉందన్నారు.
క్వింటాలుకు రూ.9,500 నుంచి రూ.10,500
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 4,74,299 ఎకరాల్లో కందులు సాగు చేయగా 2.37లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎమ్మెస్సీకి క్వింటాలుకు రూ.7 వేలకు మించి క్వింటాలుకు రూ.9.500 నుంచి 10,500 మధ్య ధర పలుకుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యాపారులతో పోటీ పడి కందులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొ్న్నారు. తెలంగాణలో ధరల స్థిరీకరణ ద్వారా గడిచిన నాలుగున్నరేళ్లలో తెలంగాణ మార్క్‌ఫెడ్ పెద్ద ఎత్తున పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గిట్టుబాటు ధర దక్కేలా చేస్తుందన్నారు. దీంతో కందుల సేకరణ బాధ్యతలను కూడా తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు అప్పగించిందని పేర్కొన్నారు. నేటి నుంచి కొనుగోళ్లు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. రాష్ట్రంలో కంది పంట సాగు చేసే రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగించుకోవాలి మంత్రి తుమ్మల రైతులకు సూచించారు.