CMRF Scam: తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ దుమారం.. 30 ప్రైవేటు ఆసుపత్రుల మాటున భారీగా దందా

by Prasad Jukanti |   ( Updated:2024-08-26 06:43:09.0  )
CMRF Scam: తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ దుమారం.. 30 ప్రైవేటు ఆసుపత్రుల మాటున భారీగా దందా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సీఐడీ గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్ కు ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు ఎఫ్ఐఆర్ లో సీఐడీ పేర్కొంది. నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సీఐడీ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సచివాలయంలోని సీఎంఎఫ్ఆర్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ విచారణ చెపట్టగా పేదల డబ్బులతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది.

వారి పాత్రపై ఆరా:

వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగులు పేరుతో మోసానికి పార్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా? లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్ కు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో హరీశ్ రావు మాజీ సిబ్బంది అరెస్ట్:

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల దుర్వినియోగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఈ కేసులో గతమంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వద్ద టేడా ఎంట్రీ ఆపరటర్ గా పని చేసే వ్యక్తిపై సైతం కేసు నమోదు అయింది.

Advertisement

Next Story