- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పరామర్శించిన సీఎం..
దిశ, యాచారం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు ఆదివారం పరామర్శించారు. కిషన్ రెడ్డి తల్లి మంచిరెడ్డి పద్మమ్మ ఈ నెల 19 తేదీన కన్నుమూశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి నివాసంలో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. దాంతో, సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఎలిమినేడు వెళ్లారు. కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
అనంతరం కిషన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమమ్యారు. పద్మమ్మ చనిపోయిన రోజు సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సంతాపం తెలియజేసి, ఆయనను ఓదార్చారు. కిషన్ రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు సబితారెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్ధానిక ప్రజాప్రతినిధులు , అధికారులు ఉన్నారు.