గౌడన్నలకు సీఎం క్షమాపణ చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్

by M.Rajitha |
గౌడన్నలకు సీఎం క్షమాపణ చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గౌడన్నలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన మహెన్నత వ్యక్తి పాపన్న గౌడ్ జయంతి రోజు కనీసం పూలమాల వేయకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యస్థాపకుడు పాపన్నగౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఆంజనేయుల గౌడ్, గెల్లు శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాపన్న జయంతిలో పాల్గొంటానని చెప్పి రాలేదని, ఇది గౌడ్ లను అమానించడమేనన్నారు. కాటమయ్య మోకుల పంపిణీ సందర్భంగా గౌడ్లను తాటిచెట్టు ఎక్కించి గంటల తరబడి ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశాలపై కనీసం అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గౌడ్ లకు తెలంగాణ లో ఆత్మగౌరవం పెంచిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గీత కార్మికులకు 5 లక్షల నుంచి 10 లక్షల ఎక్స్ గ్రేషియా, మోపేడ్ వాహనాలు, వైన్స్ లల్లో 15 నుంచి 25 శాతం పెంచుతామని, ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని, జనగాం జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పారు. ఇప్పుడు మాత్రం కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని లేకుంటే బహుజనులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకు బుద్ది చెబుతామని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పై విగ్రహ ఏర్పాటు తేదీని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed