CM Revanth Reddy : ఎకో, టెంపుల్ టూరిజంపై సీఎం నజర్

by M.Rajitha |
CM Revanth Reddy : ఎకో, టెంపుల్ టూరిజంపై సీఎం నజర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎకో, టెంపుల్ టూరిజం(Eco, Temple tourism) మీద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నేడు హైదరాబాద్(Hyderabad) లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పర్యాటక శాఖ(Tourism Department)పై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీ(Tourism Department)ని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సూచించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని ప్రత్యేకంగా తెలియజేశారు. తెలంగాణలో ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమ్మక్క-సారలమ్మ(Sammakka - Saralakka) జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్టుమెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలని పేర్కొన్నారు.

జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలని తెలియజేశారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని వివరించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాల(Godavari, Krishna Pushkaralu)కు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, పుష్కరాల సమయానికి రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Next Story