- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు తీర్పుపై CM రేవంత్ స్పందన.. ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులపై ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాలుగు వారాల్లో అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తామే సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఈ తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. హైకోర్టు తీర్పుపై తామింకా అధ్యయనం చేయలేదని అన్నారు. అందుకే దానిపై ఇప్పుడే స్పందించలేనని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని.. ఎవరి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండదు అని చెప్పారు.
ఫిరాయింపు చట్టం కఠినంగా ఉండాలని.. కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికి ఢోకా లేదు అని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 65గా ఉందని.. ఎవరూ పార్టీ మారకపోతే తమకే మేలు అని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు తమ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదని గుర్తుచేశారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
- Tags
- revanth reddy