హరీష్ రావును తప్పించేందుకే RTC యూనియన్లు రద్దు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
హరీష్ రావును తప్పించేందుకే RTC యూనియన్లు రద్దు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో హరీష్ రావు ఆర్టీసీ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఆ పదవి నుండి ఆయనను తప్పించలేక ఏకంగా బీఆర్ఎస్ కార్మిక సంఘాలనే రద్దు చేసిందని ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉన్నదన్నారు. ఇక, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడంపై హరీష్ రావు అహనం వ్యక్తం చేయగా.. హరీష్ రావు తీరును రేవంత్ తప్పుబట్టారు.

ప్రతిపక్ష నేతలు సభ నియమ నిబంధనలు ఫాలో కావాలని సూచించారు. హరీష్ రావు పదేళ్ల పాటు మంత్రిగా, శాసన సభ వ్యవహారాల మంత్రిగా కూడా పని చేశారని.. అసెంబ్లీ నిబంధనలపై అవగాహన ఉన్న వ్యక్తి స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆర్టీసీ అంశం చర్చకు వచ్చింది కాబట్టి కార్మికుల తరుఫున మాట్లాడేందుకు సాంబశివరావుకు స్పీకర్ అవకాశం కల్పించారని అన్నారు. సీపీఐకి అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నించడం హరీష్ రావుకు సరికాదని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed