- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన కీలక భేటీ.. తెలంగాణకు సోనియా రాకపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న దశాబ్ధి ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై ఆమెతో డిస్కస్ చేసినట్లు టాక్. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియాను ఆహ్వానించానని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆమెను చీఫ్ గెస్ట్‌గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.