రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై CM రేవంత్ కీలక ఆదేశం

by Satheesh |
రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై CM రేవంత్ కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణ మాఫీ అంశంపై సంబంధిత అధికారులతో రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. పంట రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా బ్యాంకర్ల నుండి రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల పూర్తి డేటా సిద్ధం చేయాలని చెప్పారు. కటాఫ్ తేదీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రైతులకు ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు కసరత్తు స్టార్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed