రేషన్ కార్డు లేని రైతులకు బిగ్ అలర్ట్.. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై CM రేవంత్ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-07-16 11:58:02.0  )
రేషన్ కార్డు లేని రైతులకు బిగ్ అలర్ట్.. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రాసెస్‌ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కార్.. లోన్ల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుంటామని స్పష్టం చేసింది. దీంతో రేషన్ కార్డు లేని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు కాకుండా పాస్ బుక్‌ల ఆధారంగా రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ కార్డు కండిషన్‌పై రైతులకు క్లారిటీ ఇచ్చారు.

పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షలు పంట రుణం మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డ్ నిబంధన పెట్టినట్లు వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీతో రేషన్ కార్డు లేని రైతుల్లో ఆందోళనకు తెర పడింది. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేసిన సర్కార్.. ఈ నెల చివర నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్ట్ 15 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed