మందకృష్ణ మాదిగ, నందమూరి బాలకృష్ణకు CM రేవంత్ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |
మందకృష్ణ మాదిగ, నందమూరి బాలకృష్ణకు CM రేవంత్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: పద్మ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ నుంచి జాతీయ అత్యుత్తమ పురస్కారాలు అందుకోబోతున్న డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి(పద్మవిభూషణ్), మందకృష్ణ మాదిగ(పద్మశ్రీ)కి శుభాకాంక్షలు చెప్పారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, వద్దిరాజు రాఘవేంద్రాచార్యులకు అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. పద్మ అవార్డుల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని నిన్న సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ‌ద్దర్ (ప‌ద్మవిభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మభూష‌ణ్‌), అందెశ్రీ (ప‌ద్మభూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మశ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మశ్రీ‌) వంటి ప్రముఖుల‌ను కేంద్ర ప్రభుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదని.. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చించారు. తెలంగాణ‌కు ప‌ద్మ పుర‌స్కారాల్లో జ‌రిగిన అన్యాయంపై ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాయాల‌నే యోచ‌న‌లో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed