ఇంట్రెస్టింగ్ సీన్.. కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన CM రేవంత్

by Satheesh |   ( Updated:2024-07-24 05:14:33.0  )
ఇంట్రెస్టింగ్ సీన్.. కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు (జూలై 24) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలపై పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. నిత్యం ప్రజా సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, కేటీఆర్‌కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని రేవంత్ ప్రార్థించారు.

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్, కేటీఆర్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటారు. అలాంటిది పుట్టిన రోజు వేళ రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేటీఆర్, రేవంత్ హుందాగా ప్రవర్తిచండంతో ఇరువురి అభిమానులు ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed