ఫ్యామిలీ అంగీకరిస్తేనే ఫొటో తీయండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
ఫ్యామిలీ అంగీకరిస్తేనే ఫొటో తీయండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ డిజిటల్ కార్డు(Family Digital Cards)లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అక్టోబరు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అన్నారు. కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫొటో తీయాలని చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని అన్నారు. కొత్త సభ్యులను జతచేసి.. చనిపోయిన వారిని తొలగించాలని సూచించారు.

మరోవైపు.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది. ఇదే కార్డు అటు రేషను అవసరాలతో పాటు ఆరోగ్యం, సంక్షేమ పథకాలకు కూడా వర్తిస్తుందని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కార్డులపై కుటుంబ యజమానిగా మహిళ పేరునే పెట్టాలనే నిర్ణయం జరిగింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ, మరో గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా అక్టోబరు 3 నుంచి కుటుంబాలను నిర్ధారించడానికి ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. పూర్తిగా గ్రామీణ స్వభావంతో కూడిన నియోజకవర్గాల్లో రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed