- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చనిపోయిన కేసీఆర్ మనవడి పెంపుడు కుక్క.. వారిపై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు.. కానీ, రాష్ట్రంలో ఎక్కడా గురుకులాలు సొంత భవనాల్లో కొనసాగడం లేదని మండిపడ్డారు. రేషనలైజేషన్ పేరిట కేసీఆర్ 6 వేల పాఠశాలలను మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వృత్తుల వారి పిల్లలు కుల వృత్తులే చేయాలని కేసీఆర్ భావించారు.
పేదలు గొర్రెలు, బర్రెలు, చేపలు మాత్రమే పెంచాలని కుట్ర చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మనవడు హిమాన్షు పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌పై కేసు పెట్టారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ పెంపుడు కుక్క ఆరోగ్యానికి ఇచ్చిన విలువ పేదలకు ఆరోగ్యానికి ఇవ్వలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని అన్నారు.