- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ చదివాను అని చెప్పేందుకు గర్వంగా ఉంది.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీచర్లు తేనేటీగల లాంటి వాళ్లు.. వాళ్లు ఎవరి జోలికి వెళ్లరు.. ఇక వాళ్ల జోలికి వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే విద్యావిధానం బాగుపడుతుందని ఆశించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య సహా అనేకమందికి సరైన గౌరవం దక్కలేదని అన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు వినేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 24వేల మంది పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో టీచర్లకు చాలా గౌరవం ఉండేదని గుర్తుచేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. గుంటూరు, పూణెలో చదివానని ఒకాయన అసెంబ్లీలో చెప్పారు. కానీ నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ టీచర్లు చదువు చెబితేనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.