పాలమూరు సభలో సీఎం రేవంత్ భావోద్వేగం.. కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
పాలమూరు సభలో సీఎం రేవంత్ భావోద్వేగం.. కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహబూబ్ నగర్‌లో నిర్వహించిన ‘ప్రజా దీవెన’ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పదవులు.. కార్యకర్తలే ముఖ్యమని తరచూ నేతలకు చెబుతుంటానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పాలమూరు బిడ్డ అయిన బూర్గుల రామకృష్ణారావును నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారు.. ఇప్పుడు సోనియా గాంధీ నాకు అవకాశం ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. నా పుర్వీకుల్లో ఎవరూ రాజకీయాల్లో లేరని అన్నారు.

తాత, తండ్రి పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వెల్లడించారు. నీకు రాజకీయాలు అవసరమా? అని నన్ను గతంలో అనేక మంది హేళన చేశారని గుర్తుచేశారు. మొదటిసారి తనను జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా పాలమూరు ప్రజలే గెలిపించారని అన్నారు. తాను పదవుల కోసం ఏనాడూ తాపత్రయ పడలేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed