కేటీఆర్ సహాయం చేయడం హర్షణీయం: సీఎం రేవంత్ రెడ్డి

by GSrikanth |
కేటీఆర్ సహాయం చేయడం హర్షణీయం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తు పత్రాన్ని మంత్రులతో కలిసి సీఎం విడుదల చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజావాణిలో న్యాయం జరుగలేదంటూ ఓ మహిళకు కేటీఆర్ సాయం చేయడం హర్షించదగిన విషయమని సెటైరికల్‌గా స్పందించారు.

ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. కేటీఆర్ ద్వారా ఆ మహిళ సమస్య పరిష్కారం అయిందని, కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక లక్షను ఆమెకు ఇచ్చారు అది చాలు అని అన్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు పీల్చి పిప్పిచేశారని అన్నారు. అసెంబ్లీలో విపక్ష నేతలకు పూర్తిగా స్వేచ్చనిచ్చామని తెలిపారు. కానీ, దానిని కేటీఆర్, హరీష్ రావులు దుర్వినియోగం చేసుకున్నారని అన్నారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడినివ్వకుండా బావ, బామ్మర్దులే హడావుడి చేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

Advertisement

Next Story