నేడు ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-09-03 15:50:51.0  )
నేడు ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో వరదలు విలయతాండవం సృష్టించాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 30కి పైగా కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితులపై సోమవారం ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం వరదలపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. నేరుగా రోడ్డు మార్గంలో ఖమ్మం బయలు దేరారు.

మార్గమధ్యమంలో సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. అనంతరం ఖమ్మంలో వరదల ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వరదల పై సమీక్ష నిర్వహించిన సీఎం రాత్రికి ఖమ్మంలోనే బస చేశారు. అనంతరం ఈ రోజు ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా మహబూబాబాద్ జిల్లాల్లో అనంతరం వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించిన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు.

అలాగే వరదల్లో కొట్టుకుపోయి మృతిచెందిన మోతీలాల్‌, అశ్విని కుటుంబాలను పరామర్శించడానికి సీఎం కాసేపట్లో గంగారం తండాకు వెళ్లనున్నారు. అనంతరం మహబూబాబాద్‌కు వెళ్లనున్నారు. ఉ.11:30 గంటలకు పురుషోత్తమాయగూడెంకు వెళ్లి.. అక్కడ ఆకేరు వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి సందర్శించనున్నారు. అలాగే మ.12:30 గంటలకు మహబూబాబాద్ కలెక్టరేట్‌కు సీఎం చేరుకుని అధికారులు కలిసి వరద నివారణ చర్యలపై సమీక్షించనున్నాను. ఈ కార్యక్రమంలో సీఎ రేవంత్ రెడ్డి వెంట స్థానిక మంత్రులు కూడా వెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed