చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే!

by Gantepaka Srikanth |
చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. చుక్కా రామయ్య ఆరోగ్యం క్షీణించిందనే సమాచారం మేరకు పరామర్శించేందుకు వెళ్లడానికి సీఎం నిర్ణయించుకున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం వివాదం కావడంతో ప్రస్తుతం సచివాలయంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 45 మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత రామయ్య ఇంటికి వెళ్లనున్నారు. అఖిలపక్షం నేపథ్యంలో ఇప్పటికే వివిధ పార్టీల నేతలు, జేఏసీ నేతలు, ఉద్యమకారులు సచివాలయానికి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed