- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి మానవత్వం చాటిన సీఎం రేవంత్ రెడ్డి!
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడానికి వెళ్లే సయమంలో అస్పత్రి వద్ద ఓ మహిళ రేవంతన్న అని ఆప్యాయంగా పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి సమస్య అడిగి తెలుసుకున్నారు. తన పిల్లల వైద్యం ఖర్చులు ఎక్కువ అవుతుందని సదరు మహిళ చెప్పడంతో.. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ విషయంలో స్పందించారు.
పిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న నవీన్ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే, అతడి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించానని తెలిపారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైదుల్ని కోరానని వెల్లడించారు. నవీన్ ఈ క్యాన్సర్ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.