CM Revanth Reddy: రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Shiva |
CM Revanth Reddy: రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ (New Tourism Policy)ని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని (Eco Tourism) ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పొద్దుటూరు (Poddutur)లో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియమ్ పార్క్‌ (Eco Friendly Experium Park)ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణరావు (Minister Jupally Krishna Rao), ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi), ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల సందర్శనకు తెలంగాణ (Telangana) వాసులు మధ్య ప్రదేశ్ (Madhya Pradesh), ఇతర ప్రాంతాలకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.

అదేవిధంగా దైవ దర్శనాలకు తమళనాడు (Tamilnadu)తో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ (Telangana)లో టెంపుల్ (Temple), ఎకో టూరిజం (Eco Tourism) వెనుకబడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రామప్ప (Ramappa), వేయి స్తంభాల గుడి (Thousand Pillared Temple) లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ఆలయాలు ఉన్నాయని తెలిపారు. కానీ, అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత పాలకులు దృష్టి పెట్టలేదని కామెంట్ చేశారు. ఎకో టూరిజంపై అసెంబ్లీలో కూడా చర్చించామని, కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు.

కాగా, మొత్తం 150 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 85 దేశాలకు నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అరుదైన వృక్షాలు, మొక్కలు ఉన్నాయి. ఎక్స్పీరియమ్ పార్క్‌ (Experium Park)లో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే వృక్షాలు ఉండటం గర్వ కారణం. ఇప్పిటికే కొన్ని వృక్షాలను సినీ, రాజకీయ ప్రముఖులు కొనుగోలు చేశారు. రామ్‌దేవ్ రావు (Ramdev Rao) ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియమ్‌ను తీర్చిదిద్దారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story